Breaking News
Home / Lifestyle / Business / నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు గరిష్ట స్థాయి  నుంచి వెనక్కి తగ్గాయి. మూడు రోజుల ర్యాలీకి బ్రేక్‌ వేస్తూ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణవైపు మొగ్గు చూపారు. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్‌ 89 పాయింట్లు క్షీణించి 40,565 వద్ద, నిఫ్టీ 32 పాయింట్లు నీరసించి 11,980 వద్ద ట్రేడవుతోంది.

ప్రధానంగా రియల్టీ, ప్రైవేట్‌ బ్యాంక్స్‌, మీడియా స్వల్పంగా లాభపడుతుండగా, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా బలహీనంగా ఉంది. యస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్, ఎంఅండ్ఎం, జీ, కోల్‌ ఇండియా, టెక్‌ మహీంద్రా, బ్రిటానియా, హీరో మోటో, హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభాల్లోనూ, ఇన్‌ఫ్రాటెల్‌, యూపీఎల్‌, సన్‌ ఫార్మా, సిప్లా, టాటాస్టీల్‌, ఎయిర్‌టెల్, గెయిల్, ఆర్‌ఐఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్, వేదాంతా నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి. మరోవైపు వాణిజ్య వివాద పరిష్కారానికి ఒప్పందం కుదరనున్న సంకేతాల కారణంగా గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టం వద్ద ముగిశాయి.

Check Also

స్టాక్ మార్కెట్ తిరిగి లాభాల్లోకి…

Share this on WhatsAppరికార్డు స్థాయికి ఆర్ఐఎల్ షేరు 34,300 ఎగువకు సెన్సెక్స్ 10100 ఎగువకు నిఫ్టీ ముంబై : దేశీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *