Breaking News
Home / Lifestyle / Business / లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు….

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు….

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 413 పాయింట్లు లాభపడి 41,352 వద్ద ముగిసింది. నిఫ్టీ 111పాయింట్లు లాభపడి 12,165 వద్ద ముగిసింది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.70.96 వద్ద కొనసాగుతోంది. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరటం.. చైనా, వాల్‌స్ట్రీట్‌ ర్యాలీ సానుకూల ఆర్థిక సంకేతాల కారణంగా ఆసియా షేర్లు 18నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా పడింది. బీఎస్‌ఈలో టైమ్‌ టెక్నోప్లాస్ట్‌, ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌, జిందాల్‌ ఎస్‌టీ పవర్‌, ఎంఎంటీసీ లిమిటెడ్‌, జై కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కంపెనీలు లాభాల్లో పయనించగా.. ట్రైడెంట్‌ లిమిటెడ్‌, పీసీ జ్యువెల్లర్‌, ఇండియన్‌ బ్యాంక్‌, మాగ్మా ఫిన్‌కార్ప్‌ లిమిటెడ్‌, వర్ల్‌పూల్‌ కంపెనీలు నష్టాలతో ముగిశాయి.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *