Breaking News
Home / Lifestyle / Business / లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు….

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు….

ముంబై: ఒడుదొడుకుల మధ్య స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు, అమెరికా-చైనా మధ్య వాణిజ్య చర్చలపై ఆశలు దేశీయ మార్కెట్లను నడిపించాయి. అమ్మకాల ఒత్తిడితో ఆరంభంలో కాస్త తడబడినా లోహ, ఐటీ రంగాల షేర్లు రాణించడంతో సూచీలు నిలబడ్డాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 247 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 11,300 పైన ముగిసింది.

సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఏకంగా 400 పాయింట్లకు పైగా లాభంతో దూసుకెళ్లింది. ఆ తర్వాత ఫార్మా, బ్యాంకింగ్‌ తదితర రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడితో సూచీ ఒడుదొడుకులకు లోనైంది. ఒక దశలో ఆరంభ లాభాలను కోల్పోయి ఫ్లాట్‌గా సాగింది. అయితే మధ్యాహ్నం తర్వాత లోహ, ఐటీ రంగాల షేర్లలో కొనుగోళ్లతో మళ్లీ పుంజుకుంది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 247 పాయింట్లు ఎగబాకి 38,127 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 70 పాయింట్ల లాభంతో 11,305 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.03గా కొనసాగుతోంది. నేటి ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు 4శాతానికి పైగా లాభపడ్డాయి. సిప్లా, వేదాంతా లిమిటెడ్‌, టాటామోటార్స్‌, ఓఎన్జీసీ షేర్లు లాభపడగా.. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, యస్‌ బ్యాంక్‌, గెయిల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, రిలయన్స్‌ షేర్లు నష్టపోయాయి.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *