Breaking News
Home / National / లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు….

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు….

ముంబై: దేశీయ మార్కెట్లు వరుసగా ఐదో సెషన్‌లోనూ లాభాల బాటలో పయనించాయి. బ్రిటన్‌, ఈయూల మధ్య  బ్రెగ్జిట్‌పై  కొత్త ఒప్పందానికి అంగీకరించినట్లు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయంగా పరిస్థితులు మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపాయి. ఈ నేపథ్యంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 453 పాయింట్లు లాభపడి, 39వేల మార్కును దాటి, 39,052వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ నిఫ్టీ 122 పాయింట్ల లాభంతో 11,586 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.71.20గా ఉంది.

ఉదయం స్టాక్‌మార్కెట్లు మందకొడిగా ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 60 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 35 పాయింట్లు లాభపడింది. గురువారం నాటి ట్రేడింగ్‌లో యస్‌ బ్యాంకు, టాటా మోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు లాభపడగా, వేదాంత, గ్రాసిమ్‌, టీసీఎస్‌, హెసీఎల్‌ టెక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ తదితర షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *