Breaking News
Home / Lifestyle / Business / లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు…

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు…

ముంబయి: దేశీయ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.50గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 165 పాయింట్లు లాభపడి 41,624 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 49 పాయింట్లు ఎగబాకి 12,224 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.22 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్‌, ఐటీ కంపెనీల షేర్లు పుంజుకోవడమే సూచీల పెరుగుదలకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. యస్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, యూపీఎల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, బీజీసీఎల్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐషర్‌ మోటార్స్, కోల్‌ ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, గెయిల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

Check Also

షహీన్‌బాగ్ నిరసనల్లో కీలక మలుపు..?

Share this on WhatsAppన్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రెండు నెలలుగా జరుగుతున్న షహీన్‌బాగ్ నిరసనలకు పరిష్కారం కనుగొనేందుకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *