Breaking News
Home / Lifestyle / Business / నష్టాల్లో స్టాక్ మార్కెట్‌ …

నష్టాల్లో స్టాక్ మార్కెట్‌ …

491 పాయింట్లు కుంగిన సెన్సెక్స్‌
రూ.2 లక్షల కోట్లు హాంఫట్‌
స్టాక్‌ మార్కెట్‌ వరుసగా నాలుగో రోజూ నష్టాలు చవి చూసింది. అమెరికా-భారత వాణిజ్య యుద్ధ భయాలు మార్కెట్‌ను వణికించాయి. ఫలితంగా అమ్మకాలు హోరెత్తి సెన్సెక్స్‌ 491.28 పాయింట్ల నష్టంతో 38,960.79 దగ్గర, నిఫ్టీ 151.15 పాయింట్ల నష్టంతో 11,672.15 దగ్గర క్లోజయ్యాయి. గత నెల రోజుల్లో కీలక సూచీలు ఇంత కనిష్ఠ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 27 కంపెనీల షేర్లు నష్టాలతో ముగిశాయి. దాదాపు అన్ని సెక్టోరియల్‌ సూచీలూ నష్టాలతోనే క్లోజయ్యాయి. మెటల్‌, ఆటో, బ్యాంకింగ్‌ కంపెనీల షేర్లలో అమ్మకాలు హోరెత్తాయి. సెన్సెక్స్‌ షేర్లలో యస్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌ కంపెనీల షేర్లు మాత్రమే కొద్ది పాటి లాభాలతో ముగిశాయి. దీంతో బీఎ్‌సఈలో నమోదైన కంపెనీల షేర్ల మార్కెట్‌ విలువ (మార్కెట్‌ క్యాప్‌) సోమవారం ఒక్కరోజే రూ.2 లక్షల కోట్లు తరిగి పోయి రూ.150.09 లక్షల కోట్లకు చేరింది. గత నాలుగు సెషన్స్‌లోనే సెన్సెక్స్‌ 706.02 పాయుంట్లు, నిఫ్టీ 234.05 పాయింట్లు నష్టయాయి.

Check Also

మరోసారి వార్తల్లో నిత్యానంద

Share this on WhatsAppఅహ్మదాబాద్: నిత్యానంద నిర్వహణలో ఉన్న స్కూల్లో తమ ఇద్దరు కూతుళ్లను నిర్భంధించారని..వారిని విడిపించాలంటూ గుజరాత్ హైకోర్టులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *