Breaking News
Home / Lifestyle / Business / నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు…

నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు…

ముంబై: ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడి మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక‍్తతలను రాజేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమన్నాయి. దీంతో ఆసియా స్టాక్‌మార్కెట్లు విలవిల్లాడాయి. ఫలితంగా ఆరంభంలోనే దేశీయ స్టాక్‌మార్కెట్‌ 350పాయింట్లు, నిఫ్టీ 100నపాయింట్లకు పైగా కుప్పకూలింది. కానీ వెంటనే పుంజుకున్నా తిరిగి నిఫ్టీ 12వేల దిగువకు చేరింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 98 పాయింట్ల నష‍్టంతో 40770 వద్ద, నిఫ్టీ 40 పాయింట్ల క్షీణించి 12011 వద్ద కొనసాగుతున్నాయి. తీవ్ర ఊగిసలాట ధోరణి నెలకింది. బ్యాంకింగ్‌, మెటల్‌, ఆటో, ఎనర్జీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. అటు రూపాయి బలహీనత నేపథ్యంతో ఐటీ షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. టీసీఎస్‌, అల్ట్రాటెక్‌, టెక్‌ మహీంద్ర, బజాజ్‌ ఆటో, రిలయన్స్‌, ఇండస్‌ఇండ్‌, ఐసీఐసీఐ లాభపడుతుండగా, బీపీసీఎల్‌, లార్సెన్‌, జీ, ఐషర్‌ మోటార్స్‌, ఎస్‌బీఐ, హిందాల్కో పవర్‌ గ్రిడ్‌, యూపీఎల్‌ నష్టపోతున్నాయి.

 

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *