Breaking News
Home / Lifestyle / Business / నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు…

నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు…

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి. సెన్సె‍క్స్‌ 15 పాయింట్ల స్వల్ప లాభంతో 37541 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు క్షీణించి 11118 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో నేడు కీలక సూచీలు రెండూ ఊగిసలాట మధ్య కొనసాగే అవకాశం ఉందని ఎనలిస్టుల అంచనా. ఫార్మ, ఆటో తప్ప దాదాపు అన్ని రంగాలు ప్లాట్ గా ఉన్నాయి.

ఏషియన్‌ పెయింట్స్‌, టాటా మోటార్స్‌, హెచ్‌యూఎల్‌, ఎం అండ్‌ ఎం, ఐసీఐసీఐ, ఎల్‌అండ్‌టీ , ఎన్‌టీపీసీ, మారుతి లాభపడుతున్నాయి. బలహీన త్రైమాసిక ఫలితాల అంచనాలతో టైటన్‌ భారీగా నష్టపోతోంది. యస్‌ బ్యాంకు తాజాగా మరో 8 శాతం కుప్పకూలింది. దీంతోపాటు హెచ్‌సీఎల్‌, టీసీఎస్‌, యూపిఎల్‌, గ్రాసిం,యాక్సిస్‌, సన్‌ ఫార్మ, ఓఎన్‌జీసీ నష‍్టపోతున్నాయి. మరోవైపు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ బలహీనంగా ఉంది. బుధవారం ఉదయం 16 పైసల నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించింది. సోమవారం నాటి 71.02తో పోలిస్తే 71.18 వద్ద వుంది.

Check Also

విక్రమ్ కోసం కొనసాగుతున్న ‘నాసా’ ప్రయత్నాలు….

Share this on WhatsAppబెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కలల ప్రాజెక్టు చంద్రయాన్‌2కి చెందిన విక్రమ్ ల్యాండర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *