Breaking News
Home / Lifestyle / Business / నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…

ముంబై: గత రెండు రోజుల్లో జీవితకాల గరిష్ఠాలు నమోదుచేస్తూ రికార్డులు సృష్టించిన మార్కెట్లు ఈరోజు కాస్త నెమ్మదించాయి. ఉదయం 9.58గంటల సమయంలో బాంబే స్టాక్‌ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్‌ 73 పాయింట్లు కోల్పోయి 40,579 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి 11,987 వద్దట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.68 వద్ద కొనసాగుతోంది. మదుపర్ల లాభాల స్వీకరణ, భారత్‌ రేటింగ్‌ను మూడీస్‌ తగ్గించడం వల్లే లాభాల జోరు అడ్డుకట్టపడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎస్ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎమ్‌అండ్‌ఎమ్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. యూపీఎల్‌, సన్‌ ఫార్మా, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, హెచ్‌యూఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

Check Also

స్టాక్ మార్కెట్ తిరిగి లాభాల్లోకి…

Share this on WhatsAppరికార్డు స్థాయికి ఆర్ఐఎల్ షేరు 34,300 ఎగువకు సెన్సెక్స్ 10100 ఎగువకు నిఫ్టీ ముంబై : దేశీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *