ముంబై: దేశీయ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:55 గంటల సమయంలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 184 పాయింట్లు ఎగిసి 40,236 వద్ద కొనసాగుతుండగా.. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 11,901 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ వద్ద 70.54 కొనసాగుతోంది. పలు పన్నులను ప్రభుత్వం తగ్గించొచ్చన్న అంచనాలతో 40వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్ నేడు కూడా అదే జోరును కొనసాగిస్తోంది.
జీ ఎంటర్టైన్మెంట్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, గెయిల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ ఫార్మా, హిందాల్కో లాభాల్లో కొనసాగుతుండగా.. టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో పయనిస్తుండడం గమనార్హం.