Breaking News
Home / Lifestyle / Business / లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు….

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు….

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాల జోరు కొనసాగుతోంది. గృహ నిర్మాణానికి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయా రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. అటు అంతర్జాతీయ మార్కెట్లు కూడా సానుకూలంగా ఉండటం, దిగ్గజ షేర్లు రాణించడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత బలపర్చింది. దీంతో గురువారం నాటి ట్రేడింగ్‌ను సూచీలు కొత్త రికార్డుల్లో ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టగా.. నిఫ్టీ 12,000 మార్క్‌ పైన కదలాడుతోంది. ఉదయం 9.45 గంటల సమయానికి సెన్సెక్స్‌ 177 పాయింట్ల లాభంతో 40,647 వద్ద, నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో 12,014 వద్ద ట్రేడ్‌అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.08గా కొనసాగుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ తదితర షేర్లు లాభాల్లో ఉన్నాయి.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *