Breaking News
Home / Lifestyle / Business / లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం ఉత్సాహంగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.31 సమయంలో సెన్సెక్స్‌ 99 పాయింట్లు లాభపడి 40,949, నిఫ్టీ 24 పాయింట్లు లాభపడి 12,067 వద్ద కొనసాగుతున్నాయి. ఇండియా బుల్స్‌ ఇంటిగ్రేటెడ్‌, హత్‌వే కేబుల్‌ అండ్‌ డేటా, కార్పొరేషన్‌ బ్యాంక్‌, సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ ఇండియా, జై కార్ప్‌ లిమిటెడ్‌ లాభాల బాటలో పయనిస్తుండగా..హెచ్‌యూడీసీవో, వొడాఫోన్‌ ఐడియా, జేపీ అసోసియేట్స్‌, జైన్‌ ఇరిగేషన్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ నష్టాల బాటపట్టాయి.

మరోపక్క హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్ప్‌ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. కంపెనీ నుంచి రుణాలు తీసుకొన్న రెండు సంస్థలు చెల్లింపులు నిలిపివేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. రూ.869 కోట్ల రుణానికి సంబంధించి చెల్లించాల్సిన ఈ సంస్థలు రూ.87 కోట్లను బకాయిపెట్టాయి. దీంతో సంస్థ ఎన్‌పీఏలపై ఇది ప్రభావం చూపుతుందని ప్రకటించడంతో నేడు షేర్లు పతనం అవుతున్నాయి.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *