ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి. అనంతరం మరింత నష్టపోయి సెన్సెక్స్ 136 పాయింట్లు నష్టపోయి 38042 వద్ద, నిఫ్టీ , 23 పాయింట్ల నష్టంతో 11290 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు వెనుకంజలో వున్నాయి. జియో ఛార్జీల మోత షురూ కావడంతో పాజిటివ్‌గా ఉంది. అటు వోడాఫోన్ ఐడియా కూడా ప్లస్‌లో ఉంది. ఐటీ మేజర్ టీసీఎస్ నేడు తన త్రైమాసిక ఫలితాలు వెల్లడించనుంది. యస్‌బ్యాంకు, ఐసీఐసీఐ, టాటా స్టీల్, ఎస్బీఐ, టాటా మోటార్స్, డా.రెడ్డీస్, హిందాల్కో, యాక్సిస్, ఎల్అండ్టీ నష్టపోతుండగా, భారతి ఎయిర్టెల్ 6 శాతం, వోడాఫోన్ ఐడియా 15 శాతం ఓఎన్జీసీ, రిలయన్స్, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, హీరో మోటో, సన్‌ఫార్మ లాభపడుతున్నాయి. మరోవైపు సెప్టెంబరు ఫెడ్ సమావేశాల మినిట్స్ వెల్లడితో డాలరు బలహీనపడింది. దీంతో దేశీయ కరెన్సీ వరుస నష్టాలనుంచి స్వల్పంగా బలపడింది. బుధవారం నాటి 71.07తో పోలిస్తే 70.95 వద్ద ప్రారంభమైంది.
