Breaking News
Home / Lifestyle / Business / నేడు కూడా నష్టాలు చవిచూసిన స్టాక్ మర్కెట్స్…

నేడు కూడా నష్టాలు చవిచూసిన స్టాక్ మర్కెట్స్…

ముంబై : ఉత్పాదక రంగంలో మందగమనంతో పాటు బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి స్టాక్‌ మార్కెట్లను కుదిపేసింది. అమ్మకాల ఒత్తిడితో మంగళవారం స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌లో అవకతవకలు జరిగాయనే అభియోగాలతో పాటు పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర సహకార బ్యాంక్‌లో సంక్షోభం తీవ్రమవడం మదుపుదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. యస్‌బ్యాంక్‌ షేర్లు ఏకంగా 24 శాతం మేర పతనమయ్యాయి. టెలికాం, రియల్టీ, ఐటీ సహా పలు రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 361 పాయింట్ల నష్టంతో 38,305 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 114 పాయింట్ల నష్టంతో 11,359 పాయింట్ల వద్ద క్లోజయింది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, భారతి ఎయిర్‌టెల్‌, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్‌, టీసీఎస్‌ నష్టాలతో ముగిశాయి.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *