ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 292 పాయింట్లు పెరిగి 38,506 వద్ద, నిఫ్టీ 87 పెరిగి 11,428 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. ముఖ్యంగా బ్లూచిప్ షేర్లను బాగా కొనుగోలు చేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఐటీసీ, మారుతీ షేర్లు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 27, వేదాంత షేర్లు 4శాతం మేరకు ఎగసిపడి లాభపడ్డాయి. నిఫ్టీ ఐటీ సూచీ తప్ప మిగిలినవి మొత్తం లాభాల్లో ముగిశాయి.
ఆసియాలోని స్టాక్ మార్కెట్లు లాభపడటం కూడా దేశీయ మార్కెట్లకు బలాన్నిచ్చింది. ముఖ్యంగా బ్రెగ్జిట్‌పై చర్చలు ముందుకు జరగొచ్చనే ఊహాగానాలు ఆ మార్కెట్లను నడిపించాయి. ఆస్ట్రేలియా మార్కెట్లు భారీగా లాభపడగా జర్మనీ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
మంగళవారం నాటి ట్రేడింగ్‌లో ఐషర్ మోటార్స్, వేదంతా, జీ ఎంటర్టైన్, ఎం అండ్ ఎం, హీరో మోటో కార్ప్ తదితర షేర్లు లాభపడగా, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, భారతీ ఇన్ఫ్రాటెల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటామోటార్స్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.