Breaking News
Home / States / సమ్మె విరమించి… తక్షణమే….

సమ్మె విరమించి… తక్షణమే….

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి తక్షణమే చర్చలకు వెళ్లాలని హైకోర్టు కార్మికులకు సూచించింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే సమ్మె విరమించాలని ఆదేశించింది. పండుగలు, పాఠశాలల సమయంలో సమ్మె చేయడం ఎంతవరకు సమంజసం అని హైకోర్టు ప్రశ్నించింది. నిరసనలకు అనేక పద్దతులు ఉన్నాయి కదా అని యూనియన్లను నిలదీసింది. న్యాయమైన డిమాండ్ల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టవచ్చా. చట్టాన్ని ఉల్లంఘించవచ్చా. ఎస్మా ఎందుకు అమలు చేయకూడదో చెప్పాలని ఆర్టీసీ యూనియన్లను హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 75శాతం బస్సులు నడుస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. మరికొన్ని రోజుల్లో మిగితావి పునరుద్ధరిస్తామని వివరించింది. చర్చల ద్వారా ఏ సమస్యైనా పరిష్కరించుకోవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *