Breaking News
Home / National / అపరిచిత వ్యక్తి వాట్సాప్ కాల్ తో బెదిరింపు…

అపరిచిత వ్యక్తి వాట్సాప్ కాల్ తో బెదిరింపు…

కోటా(రాజస్థాన్): కోటా ప్రాంతానికి చెందిన నిఖిల్ పాల్ సింగ్ ఇటీవల కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ వెళ్లేందుకు ఓ సైకిల్ టూర్ ప్లాన్ చేశాడు. తన మిత్రులతో కలిసి ఓ బృందంగా ఏర్పడి ఈ టూర్‌కు వెళ్లాలనేది అతడి ప్లాన్. ఇంతలో ఓ రోజు ఒక అపరిచిత వ్యక్తి నుంచి అతడికి వాట్సాప్ కాల్ వచ్చింది. “కశ్మీర్ ఉన్నది నీవు సైకిల్ తొక్కడానికి కాదు. నువ్వు అక్కడ అడుగుపెట్టావో..లేపేస్తాం, జాగ్రత్త” అంటూ ఆ గుర్తుతెలియని వ్యక్తి నిఖిల్‌ను బెదిరించాడు. దీంతో కంగారు పడిన నిఖిల్ వెంటనే స్థానిక పోలిస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ బెదిరింపు నేపథ్యంలో అతడి టూర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *