Breaking News
Home / States / ఎవరు పిలిచినా చర్చలకు సిద్ధం: ఐకాస నేత

ఎవరు పిలిచినా చర్చలకు సిద్ధం: ఐకాస నేత

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు ముగిసిన అనంతరం ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేత అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పిలిచినా, యాజమాన్యం పిలిచినా తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని, ప్రస్తుతానికి సమ్మె యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం మైండ్‌గేమ్‌ ఆడుతోందని, ఎంపీ కేకే సహా ఎవరూ తమతో మాట్లాడలేదన్నారు. అన్ని విషయాలు ఈనెల 18న తమ న్యాయవాది ద్వారా హైకోర్టుకు వివరిస్తామని తెలిపారు. కార్మికులతో చర్చించి సమస్య పరిష్కరించుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించిందని అశ్వత్థామరెడ్డి వివరించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *