Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / రాష్ట్ర శ్రేయస్సు కోసం పోరాటం….

రాష్ట్ర శ్రేయస్సు కోసం పోరాటం….

అమరావతి: రాష్ట్ర శ్రేయస్సు కోసం పోరాటం చేయడంలో తప్పేముందని? బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. పోలవరం కాంట్రాక్టుల కోసం ప్రత్యేక హోదానే చంద్రబాబు నీరుగార్చారని ఆయన అన్నారు. సాక్షి మీద క్షక్ష్యసాధింపు కోసం గత ప్రభుత్వం జీవో నెం.868 ను తేలేదా? అని గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రామారావు పార్టీని స్వాధీనం చేసుకున్న వ్యక్తి చంద్రబాబు అని బుగ్గన వ్యాఖ్యానించారు. ఏదో విధంగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పడంలో బాబు దిట్ట అని అన్నారు. ప్రత్యేక హోదాను నీరుగార్చి ప్రత్యేక ప్యాకేజీ అని ప్లేటు ఫిరాయించారు. ప్రత్యేక హోదాను నీరుగార్చినందుకే పోరాటం చేశామని బుగ్గన అన్నారు. పోలవరం నిర్వాసితుల గురించి సాక్షి కథనాలు రాస్తే.. చర్యలు తీసుకోమని గత సర్కార్ నోటీసులు ఇవ్వాలేదా? అని బుగ్గన సభలో ప్రస్తావించారు. జగతి పబ్లికేషన్ పై కూడా నోటీసులు జారీ చేశారన్నారు. అవాస్తవ కథనాలపై చర్యలు తీసుకోవాలనే మేం జీవో తీసుకువచ్చామని అన్నారు. రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు మాట్లాడటం సబబేనా అని బుగ్గన అన్నారు. సీఎంను అనరాని మాటలు అనడం మంచిది కాదని అన్నారు. కచ్చితంగా చంద్రబాబు సీఎంకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *