Breaking News
Home / Crime / భయంతో విద్యార్థి ఆత్మహత్య..

భయంతో విద్యార్థి ఆత్మహత్య..

ఓ విద్యార్థి ఇటీవలే ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాశాడు. త్వరలో ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే ఈ క్రమంలో ఓ విద్యార్థి తాను పరీక్షలో ఫెయిల్ అవుతాననే భయంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మల్కాజిగిరిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా అముదావలసకు చెందిన ఓ విద్యార్థి(17) తన మేనమామ వద్ద మౌలాలి గ్రీన్ హిల్స్ కాలనీలో ఉండి చదువుకుంటున్నాడు. అయితే ఇటీవల ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాశాడు. అయితే సదరు విద్యార్థి చదువులో వెనుకబడడంతో పరీక్షలో ఫెయిల్ అవుతానేమోననే భయంతో గురువారం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సాయంత్రం గమనించిన మేనమామ మల్కాజిగిరి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు మేనమామ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Check Also

కళ్లు మూసుకుపోయిన కామాంధుడు.. ఆవుపై అఘాయిత్యం

Share this on WhatsAppకామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. పశువులు కూడా సిగ్గుపడేలా వ్యవహరించాడు. మూగజీవి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *