Breaking News
Home / States / విద్యార్థులు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది…

విద్యార్థులు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది…

హైదరాబాద్‌: ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల సెలవులను పొడిగించాలని బాలలహక్కుల సంఘం డిమాండ్‌ చేసింది. సమ్మె కారణంగా పాఠశాలలకు వెళ్లే పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. ఆర్టీసి కార్మికులు సమ్మెను ఉధృతం చేసే సూచనలు ఉన్నందున పాఠశాలల విద్యార్ధులు ఇబ్బంది పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పాఠశాలలకు వెళ్లే సమయంలో మార్గమధ్యలోనే బస్సులు నిలిచిపోతే పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని అన్నారు. వెంటనే పాఠశాలల సెలవులను ఈనెల 21వ తేదీ వరకూ కొనసాగించాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్‌ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *