Breaking News
Home / States / Andhra Pradesh / విద్యార్ధులు భావి భారత నిర్ణేతలు: గవర్నర్

విద్యార్ధులు భావి భారత నిర్ణేతలు: గవర్నర్

విజయవాడ: గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ ఈ సమావేశంలో స్వతంత్య్ర సమరయోధులకు సన్మానం చేయడం సంతోషమని అన్నారు. విద్యార్ధులు భావి భారత నిర్ణేతలని గాంధీజీ అన్నారని గుర్తు చేశారు. యువతకు గాంధీజీ ఇచ్చిన సందేశాలు కాలంతో సంబంధం లేకుండా సమకాలీనమేనని కొనియాడారు. గాంధీజీ ఆలోచనలు, విధానాలు ఉపాధ్యాయులకు చాలా ఉపయోగపడతాయని చెప్పారు. సత్యమేవ జయతే అని మహాత్ముడు చెప్పారని, అహింస, సత్యం మాట్లాడటం గాంధీజీ నేర్పిన అంశాలని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు మర్చిపోలేనివని, తెలుగు తనకు అర్ధం కాకపోయినా, విద్యార్ధుల మాటల్ని వారి ఉద్వేగం నుంచి అర్ధం చేసుకున్నానని పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *