అమరావతి: అర్చకులతో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సమావేశమయ్యారు. అర్చకుల సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీ వేస్తామని, ఆలయాల భూములు, ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తామని మంత్రి చెప్పారు. అర్చక వారసత్వ హక్కుల ప్రకారం అర్చకత్వం కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కనీస ఆదాయం లేని దేవాలయాలకు అర్చక గౌరవ వేతనం 5 నుంచి 10 వేలకు పెంచడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. అర్చక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లంపల్లి వెల్లడించారు.
