విజయనగరం: పూల్ బాగ్ శ్రీ లక్ష్మీ గణపతి కాలనీలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యం దేవాలయం లో కార్తీకమాసం సందర్భంగా అక్టోబర్ 29 నుండి మాల ధారణ ప్రారంభమవుతుందని ఆలయ ధర్మకర్త శ్రీ కర్రీ వెంకటరమణ సిద్ధాంతి తెలిపారు. శనివారం ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మాలాధారణలో మండల దీక్షలు, అర్ధ మండల దీక్షలు, ఏకాదశ దీక్షలు వుంటాయని, ఇందులో పాల్గొనే భక్తులకు పీఠ పూజకు అవసరమైన బట్టలు, పూజాసామాగ్రి, వసతి ఏర్పాట్లు అన్నీ దేవాలయం వద్ద ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
