Breaking News
Home / States / సకల జనుల దీక్ష విజయవంతం…

సకల జనుల దీక్ష విజయవంతం…

హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌పై ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్వహించిన ‘సకల జనుల సామూహిక దీక్ష’ విజయవంతమైందని ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీ మహిళా కార్మికులతో పాటు పలు మహిళా సంఘాలు ఈ కార్యక్రమం జయప్రదం చేయడంలో కీలకపాత్ర పోషించాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి మద్దతిచ్చిన మహిళలు, ప్రజాసంఘాలకు ఐకాస తరఫున అశ్వత్థామరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై మహిళలపై జరిగిన దాడికి నిరసనగా ఆదివారం ఉదయం అన్ని ఆర్టీసీ డిపోల వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తామని చెప్పారు.  మహిళలపై దాడి చేసిన విషయంపై ఏ ఒక్క మంత్రి కూడా స్పందించకపోవడం దారుణమని ఆయన ఆక్షేపించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *