Breaking News
Home / States / విజయవంతమైన వెట్‌ ట్రయల్‌ రన్‌….

విజయవంతమైన వెట్‌ ట్రయల్‌ రన్‌….

కరీంనగర్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, రికార్డు స్థాయిలో నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్ధేశ్యంతో సీఎం కేసీఆర్‌ ఈ మహా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి అనతి కాలంలోనే పూర్తి చేశారు. రామడుగు మండలం లక్ష్మీపురం వద్ద గాయత్రి పంపుహౌజ్‌లో శనివారం ఉదయం 9.50 గంటలకు చివరిదైన ఏడో పంపును అధికారులు వెట్‌ ట్రయల్‌ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. గాయత్రి పంప్‌హౌజ్‌లో మొత్తం ఏడు పంపులను ఏర్పాటు చేయగా ఇప్పటికే ఆరు పంపుల నుంచి వెట్ ను నిర్వహించారు. అన్ని పంపుల నుంచి నీటిని విజయవంతంగా విడుదల చేయడంతో అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లిఫ్ట్‌ అడ్వయిజర్‌ పెంటారెడ్డి, ఈఈ నూనె శ్రీధర్‌, ఏఈఈలు, ఏజన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *