Breaking News
Home / Crime / ‘‘అమ్మా ఐ లవ్యూ.. ఈ లోకాన్ని విడిచి పోతున్నా’’

‘‘అమ్మా ఐ లవ్యూ.. ఈ లోకాన్ని విడిచి పోతున్నా’’

ఢిల్లీ: రోజూ టీచర్ తిడుతోందని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఢిల్లీలోని ఇంద్రపురిలో చోటుచేసుకుంది. డిసెంబర్ 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. 12 ఏళ్ల విద్యార్థిని ఈ నెల ఒకటో తారీఖున మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉరేసుకుంది. ‘‘అమ్మా ఐ లవ్యూ.. ఈ లోకాన్ని విడిచి పోతున్నా’’ అని చేతిమీద రాసుండటాన్ని పోలీసులు గుర్తించారు. న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న ఆమె తల్లి… కోర్టుకు వెళ్లి వచ్చేసరికి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. విద్యార్థిని తల్లి మీడియాతో మాట్లాడుతూ.. తన కూతురిని స్కూల్లో ఓ టీచర్ రోజూ తిడుతూ ఉందని.. శుక్రవారం నాడు కూడా క్లాస్ టీచర్ విద్యార్థుల ముందే తిట్టడంతో తన బిడ్డ తీవ్రంగా బాధపడిందని తెలిపింది. ఈ విషయం గురించి తమ కూతురు ఇంటికి వచ్చి చెప్పిందని, అయితే స్కూల్ మారుద్దామనుకున్నానని.. కానీ అంతలోనే ఇలా జరిగిపోయిందంటూ బోరున విలపించింది. డిసెంబర్ 20న తన కూతురి పుట్టినరోజని.. ఆమెను ఔటింగ్‌కి కూడా తీసుకువెళదామనుకున్నానని .. కానీ అవకాశం లేకుండా పోయిందన్నారు. విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బాలిక చదువుతున్న స్కూల్ యాజమాన్యం కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసి.. అంతర్గత విచారణ చేపట్టింది.

Check Also

సభలో కలతచెందిన సోనియాగాంధీ

Share this on WhatsAppన్యూఢిల్లీ: రాఫెల్ డీల్‌పై దేశాన్ని తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *