Breaking News
Home / States / అకస్మాత్తుగా నిలిచిపోయిన మెట్రో రైల్…

అకస్మాత్తుగా నిలిచిపోయిన మెట్రో రైల్…

హైదరాబాద్: విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్యల కారణంగా అమీర్‌పేట్ సమీపంలో మెట్రో రైలు నిలిచిపోయింది. బేగంపేట్, అమీర్‌పేట్ స్టేషన్ల మధ్య విద్యుత్ లైన్‌లో సాంకేతిక సమస్య ఉత్పన్నమైంది. దీంతో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. దీనిపై స్పందించిన మెట్రో అధికారులు.. సాంకేతిక సమస్య కారణంగా సింగిల్ లైన్ విధానంలో రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. ఫలితంగా మెట్రో రైలు ప్రయాణం కొంత ఆలస్యం అవుతోంది. సమస్య పరిష్కారానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Check Also

ఎన్‌కౌంటర్ పై దేశ ప్రజలంతా హర్షిస్తున్నారు…

Share this on WhatsAppవరంగల్‌: దిశ ఘటనలో పోలీసుల చర్య సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *