Breaking News
Home / States / Andhra Pradesh / Kurnool / సుధాకర్‌ బాబు రాజీనామా..

సుధాకర్‌ బాబు రాజీనామా..

కర్నూలు: మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌ బాబు టీడీపీకి రాజీనామా చేశారు. తన కార్యాలయంలో శనివారం విలేఖరుల సమావేశం నిర్వహించి నిర్ణయం ప్రకటించారు. అధికారం కోల్పోయాక టీడీపీ అధినేత చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. రాజకీయ అవసరాల కోసం ప్రజల మధ్య బంధాలను దూరం చేయడం సరికాదని అన్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక దేవస్థానాల్లో క్రైస్తవులు ఉన్నారని సోషల్‌ మీడియాలో టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.ఎన్నికల సమయంలో క్రైస్తవులకు అన్నీ చేస్తామని గుంటూరులోని ఓ చర్చిలో చంద్రబాబు ప్రకటించి యూటర్న్‌ తీసుకున్నారని అన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు పిచ్చిపట్టిందని అన్నారు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని పవన్‌ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. క్రైస్తవ సమాజం గురించి పవన్‌ మరోసారి ప్రస్తావిస్తే బట్టలు ఊడదీసి కొడతారని హెచ్చరించారు. చంద్రబాబు మత రాజకీయాలను వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. తన అనుచరులతో చర్చించి ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని తెలిపారు.

Check Also

వడ్డీతో సహా ఇంతకింత చెల్లిస్తాం జాగ్రత్త

Share this on WhatsAppదశాబ్దాలుగా టీడీపీలో పదవులు పొందినవాళ్లు.. ఇప్పుడు వేదింపులకు భయపడి పార్టీ మారుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *