విజయవాడ: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో ఉరేసుకుని గురజాల పూర్ణ తేజ(22) అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే తేజ ఆత్మహత్యకు మతిస్థిమితం లేకపోవడమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
