జగిత్యాల: జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కడుపునొప్పి భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. గొల్లపల్లి మండలం చెందొలి గ్రామానికి చెందిన దండిగ శిరీష అనే యువతి కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు వైద్యులకు కూడా చూపించారు. అయినా కడపునొప్పి మాత్రం తగ్గలేదు. ఈక్రమంలో మరోసారి శిరీషకు కడుపునొప్పి వచ్చింది. ఆ బాధ భరింలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. యువతి మృతితో కుటుంబ సభ్యులు, బంధవులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.
