Breaking News
Home / hyderabad / తనపై వచ్చిన పుకార్లకు స్పందించిన సునీతా కృష్ణన్‌

తనపై వచ్చిన పుకార్లకు స్పందించిన సునీతా కృష్ణన్‌

ప్రముఖ సామాజిక సేవకురాలు సునీతా కృష్ణన్‌‌కు గాంధీ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు జరిగాయి. పరీక్షలు పూర్తయ్యాయని.. ఫలితాల గురించి ఎదురుచూస్తున్నట్టు ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన తాను దగ్గుతో బాధపడుతున్నానని.. ఈ మేరకు పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు వెళ్లానన్నారు. తనపై వస్తున్న ఎలాంటి ఫేక్ వార్తలను నమ్మొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్‌-19) తెలంగాణలోకి ప్రవేశించింది. భారత్‌లో కొత్తగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *