Breaking News
Home / States / Andhra Pradesh / సీఎం బహిరంగ సభ… అధికారుల పర్యవేక్షణ…

సీఎం బహిరంగ సభ… అధికారుల పర్యవేక్షణ…

పశ్చిమ గోదావరి: ఈ నెల 4వ తేదీన ఏలూరులోని ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ బహిరంగ సభ ఏర్పాట్లను అధికార యంత్రాంగం బుధవారం పర్యవేక్షించింది. జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు, ఎస్పీ నవదీప్‌ సింగ్‌, జేసీ వేణుగోపాల్‌ రెడ్డి, ఏఆర్‌ అదనపు ఎస్పీ మహేష్‌ కుమార్‌, బిడిఎస్పీలు దిలీప్‌ కిరణ్‌, ఎంజెవి భాస్కర్‌, శ్రీనివాసాచారి, కృష్ణంరాజు, ఇతర పోలీస్‌, రెవెన్యూ అధికారులు కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా మెడికల్‌ కళాశాల శంకుస్థాపన చేసే స్థలాన్ని ఏలూరు రేంజ్‌ డీఐజీ జిల్లా ఎస్పీ నవదీప్‌ సింగ్‌, జిల్లా కలెక్టర్‌ ముత్యాల రాజు లు పరిశీలించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *