హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెకు ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాలన్నీ ఎంతో పోరాటం చేశాయని.. ఆ స్పూర్తితోనే తాము ఇప్పుడు ఆర్టీసీని కాపాడుకునేందుకు సమ్మె చేస్తున్నామన్నారు. ఉద్యోగ సంఘాలను ఏమైనా నొప్పించినట్టు మాట్లాడితే క్షమించి… తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని అశ్వత్థామరెడ్డి కోరారు.
