Breaking News
Home / National / సీబీఐ చీఫ్ కేసులో తీర్పు వాయిదా

సీబీఐ చీఫ్ కేసులో తీర్పు వాయిదా

న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్ అలోక్ వర్మ కేసులో వాదనలు పూర్తయ్యాయి. వర్మతోపాటు కామన్ కాజ్ అనే ప్రభుత్వేతర సంస్థ దాఖలు చేసిన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వర్మతోపాటు సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాను అక్టోబరులో కేంద్ర ప్రభుత్వం సెలవుపై పంపించింది. వీరిద్దరూ పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో వీరిని సెలవుపై పంపి, నాగేశ్వర రావును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సమక్షంలో గురువారం ఈ కేసులో వాదనలు జరిగాయి. అక్టోబరు 23న రాత్రి అకస్మాత్తుగా వర్మ, ఆస్థానాలను సెలవుపై పంపుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యను జస్టిస్ గొగోయ్ ప్రశ్నించారు.

జూలై నుంచి వర్మ, ఆస్థానా మధ్య నెలకొన్న పరిస్థితులు తీవ్ర రూపం దాల్చడంతో ఈ చర్య తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కే కే వేణుగోపాల్ తెలిపారు. సీబీఐ ఉన్నతాధికారులపై చర్య తీసుకునే ముందు విస్తృత స్థాయి కమిటీని ఎందుకు సంప్రదించలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. వ్యవస్థ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

Check Also

సభలో కలతచెందిన సోనియాగాంధీ

Share this on WhatsAppన్యూఢిల్లీ: రాఫెల్ డీల్‌పై దేశాన్ని తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *