Breaking News
Home / National / ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీపై సుప్రీంకోర్టులో విచారణ..

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీపై సుప్రీంకోర్టులో విచారణ..

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీపై దాఖలైన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు అనుమతించింది. అరెస్టుకు ముందస్తు అనుమతి తప్పనిసరన్న గత ఆదేశాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎఫ్‌ఐఆర్ నమోదుకు ప్రాథమిక విచారణ అవసరమన్న ఆదేశాలనూ సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. మార్చి 20, 2018లో సుప్రీం ఇచ్చిన తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా, ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీలకు చెందిన ప్రజలు నేటికి సమానత్వం కోసం పోరాడుతున్నారని వారు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం ఆర్టికల్ 15 ఆధారంగా వారికి ప్రత్యేక రక్షణ కల్పించిందనీ, అయినప్పటికీ వారు సమాజంలో సామాజిక బహిష్కరణకు గురవుతున్నారని ధర్మాసనం తెలిపింది. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తే అది కులాల తప్పు కాదనీ, మానవ తప్పిదం మాత్రమేనని సుప్రీంకోర్టు తెలిపింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *