తిరుమల: గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ బోపన్న శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొన్న వారికి తితిదే అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి శేషవస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.
