హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను ఇవాళ రాజ్ భవన్ లో స్వామి పరిపూర్ణానంద కలిశారు. తమిళిసైతో స్నేహపూర్వకంగానే భేటీ అయినట్టు పరిపూర్ణానంద తెలిపారు. తమిళిసై తెలంగాణ గవర్నర్ గా వచ్చిన తర్వాత ఇప్పటివరకు కలవడం కుదరలేదని వెల్లడించారు. గవర్నర్ తో తాను రాజకీయాల గురించి మాట్లాడలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపైనా పరిపూర్ణానంద స్పందించారు. ఆర్టీసీ వ్యవహారం మరింత సంక్లిష్టంగా మారుతోందని అన్నారు.
