Breaking News
Home / Lifestyle / Recipes / స్వీట్‌పొటాటో బాల్స్‌

స్వీట్‌పొటాటో బాల్స్‌

కావలసినవి: చిలగడదుంపల గుజ్జు – 3 కప్పులు (స్వీట్‌పొటాటోలను ఉడికించుకుని ముద్దలా చేసుకోవాలి), చీజ్‌ – 4 టేబుల్‌ స్పూన్లు, టమాటో సాస్‌ – 3 టేబుల్‌ స్పూన్లు, మైదాపిండి – పావు కప్పు, గుడ్లు – 2, పాలు – అర టేబుల్‌ స్పూన్‌, బ్రెడ్‌ పౌడర్‌ – పావు కప్పు, నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా
తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో చిలగడదుంపల గుజ్జు, చీజ్, టమాటో సాస్‌ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మైదాపిండి ఒక బౌల్‌లో.. పాలు, గుడ్లు మరో బౌల్‌లో.. బ్రెడ్‌ పౌడర్‌ ఇంకో బౌల్‌లో వేసుకుని బాల్స్‌ని మైదాపిండిలో ముంచి, గుడ్డు మిశ్రమాన్ని పట్టించి, బ్రెడ్‌ పౌడర్‌లో అటు ఇటూ తిప్పి.. నూనెలో డీప్‌ఫ్రై చేసుకుని వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి.

Check Also

సజ్జలతో మంచూరియా

Share this on WhatsAppకావలసిన పదార్థాలు: సజ్జ పిండి – 150 గ్రా., మిర్చి – 10 గ్రా., కొత్తిమీర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *