Breaking News
Home / Lifestyle / Recipes / స్వీట్‌ పొటాటో కట్లెట్స్‌ మీకోసం…

స్వీట్‌ పొటాటో కట్లెట్స్‌ మీకోసం…

వంటలు:

కావలసినవి:
చిలగడదుంపలు – 4; బంగాళదుంప – 1; మెంతి ఆకు గుజ్జు – ముప్పావు కప్పు; ఉల్లి పాయల గుజ్జు – పావు కప్పు; పచ్చిమిర్చి పేస్ట్‌ – 1 టీ స్పూన్‌; అల్లం గుజ్జు – అర టేబుల్‌ స్పూన్‌; మామిడి గుజ్జు – అర టీ స్పూన్‌ (లేదా ఒక చెక్క నిమ్మరసం); జీలకర్ర పేస్ట్‌ – అర టీ స్పూన్‌; కారం – పావు టీ స్పూన్‌; కొత్తిమీర తురుము – పావు కప్పు; బ్రెడ్‌ పౌడర్‌ – అర కప్పు; ఉప్పు – తగినంత; నూనె – సరిపడా.

తయారీ విధానం:
ముందుగా బంగాళదుంప, చిలగడదుంపలను ముక్కలుగా కట్‌ చేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చిలగడదుంపలను ముద్దలా చేసుకుని.. అందులో మెంతి ఆకు గుజ్జు, ఉల్లిపాయల గుజ్జు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం గుజ్జు, మామిడి గుజ్జు లేదా నిమ్మరసం, జీలకర్ర పేస్ట్, కారం, కొత్తిమీర తురుము, బ్రెడ్‌ పౌడర్, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా మెత్తగా ముద్దలా చేసుకుని.. చివరిలో బంగాళదుంప ముక్కలను వేసుకుని అటూఇటూగా కలిపి.. కట్లెట్స్‌లా చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. అంతే రుచికరమైన పొటాటో కట్లేట్స్ ని ప్లేట్ పెట్టి సర్వ్ చేసుకోవాలి.

Check Also

సజ్జలతో మంచూరియా

Share this on WhatsAppకావలసిన పదార్థాలు: సజ్జ పిండి – 150 గ్రా., మిర్చి – 10 గ్రా., కొత్తిమీర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *