Breaking News
Home / States / హైదరాబాద్‌లో నేటి నుంచి కైట్స్‌, స్వీట్స్‌ ఫెస్టివల్‌

హైదరాబాద్‌లో నేటి నుంచి కైట్స్‌, స్వీట్స్‌ ఫెస్టివల్‌

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహణ
టూరిజంశాఖ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు
50 ఫుడ్‌ కోర్టులు, 50 చేనేత వస్ర్తాల స్టాళ్లు
వివిధ దేశాల నుంచి కైట్‌ ఫ్లయర్స్‌
గంటపాటు నైట్‌ ఫ్లయింగ్‌..
ఉదయం వేళలో సాధారణరీతిలో పోటీలు జరుగుతుండగా, రాత్రి 7 గంటల నుంచి 8 గం టల వరకు పతంగుల పోటీలను నిర్వహించనున్నారు. రాత్రిపూట పతంగులను ఎగురవేసే సా మర్థ్యం ఉన్న నిపుణులు కూడా ఈ ఫెస్ట్‌లో పా ల్గొంటున్నారు. ఉదయం ఎండ తీవ్రత కారణం గా పోటీలను చూడలేని వారు సాయంత్రం వీక్షించే అవకాశం ఉంది.

నగరానికి చేరిన కైట్‌ ఫ్లయర్స్‌..
పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన 40 మంది కైట్‌ ఫ్లయర్స్‌ శనివారం నగరానికి చేరుకున్నారు. వీరిని టూరిజంశాఖ అధికారులు శంషాబాద్‌ విమానాశ్రయంలో స్వాగతం పలికి హోటళ్లలో వసతి, సదుపాయాలు కలిపంచారు. దేశానికి చెందిన 60 మంది క్రీడాకారులు సైతం పోటీల్లో పాల్గొననున్నారు.

స్వీట్ల మేళా…
ఈ సారి పతంగుల పండుగతోపాటు సరికొత్తగా స్వీట్‌ ఫెస్టివల్‌ను కూడా నిర్వహిస్తు న్నారు. హానగరంలో నివాసముంటున్న వివిధ రాష్ర్టాలకు చెందిన మహిళలు తమ ప్రాంతాల్లో ప్రఖ్యాతిగాంచిన స్వీట్లను తమ ఇళ్లలో తయారు చేసి ఇక్కడ ప్రదర్శించనున్నారు.
మొత్తం 100 స్టాళ్లు..
కైట్స్‌ అండ్‌ స్వీట్స్‌ ఫెస్టివల్‌ను పురస్కరించుకుని చేనేత వస్ర్తాలతోపాటు మెగా ఫుడ్‌ కోర్టు ను ఏర్పాటు చేశారు. ఇందులో రెండు విభాగాలకు సంబంధించి 50 చొప్పున స్టాళ్లను ఏర్పాటు చేశారు. గతేడాదిపతంగుల పండుగను వీక్షించేందుకు 8 లక్షల మంది హాజరయ్యారు. ఈసా రి సందర్శకుల సంఖ్య పది లక్షలకు చేరే అవకాశం ఉంద ని భావిస్తున్నారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేశారు. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మరోవైపు పోలీసు అధికారులు సైతం గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.

Check Also

ఎన్నికల ఫలితాలపై నారా భువనేశ్వరి స్పందన

Share this on WhatsAppహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరేసి.. ఊహించని మెజార్టీ సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *