Breaking News
Home / National / స్విస్‌ బ్యాంక్‌ ఖాతాల గుట్టు రట్టు

స్విస్‌ బ్యాంక్‌ ఖాతాల గుట్టు రట్టు

న్యూఢిల్లీ: స్విస్‌బ్యాంకు ఖాతాల గుట్టు బయటకు వస్తోంది. స్విస్‌బ్యాంక్‌లో దాగిన నల్లధనాన్నిబయటకు తీసుకు వస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్టుగానే ఆ దిశలో అడుగులు పడుతున్నాయి. ఆ బ్యాంకులో నల్లధనాన్ని దాచుకున్న భారతీయుల వివరాలన్నీ దేశానికి చేరుతున్నాయి. ఇప్పటికే తొలివిడత వివరాలు వచ్చేశాయి. ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకునే (ఏఐఓఐ) విధానంలో ఈ వివరాలను అందించినట్టు స్విట్జర్లాండ్‌ దేశానికి చెందిన ఫెడరల్‌ ట్యాక్స్‌ అడ్మినిస్ర్టేషన్‌ (ఎఫ్‌టీఏ)కు ఒక అధికారి పీటీఐ వార్తాసంస్థకు వెల్లడించారు. ఈ విధానం కింద భారత్‌ దేశం ఇలాంటి వివరాలు పొందడం ఇదే తొలిసారి.

అయితే ఇందులోని వివరాలన్నీ రహస్యంగా ఉంచాలన్న నిబంధనలు ఉండడంతో వాటిని వెల్లడించలేమని ఎఫ్‌టీఏ అధికారి ఒకరు తెలిపారు. ఈ సంవత్సరానికి సంబంధించి ఖాతాల వివరాలను మరో తొమ్మిది నెలల తర్వాత అందజేస్తామని తెలిపారు దీని ప్రకారం 2020 సెప్టెంబరులో 2019కి సంబంధించిన వివరాలు అందనున్నాయి. ప్రస్తుతం అందిన వివరాలను పరిశీలిస్తే లెక్కల్లో చూపని ఆదాయం కలిగిన వారిపై విచారణ జరిపే అవకాశం ఉందని భావిస్తున్నారు. డిపాజిట్లతో సహా లావాదేవీలకు సంబంధించిన వివరాలు జాబితాలో ఉన్నాయి. అలాంటి వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. తొలి విడతగా లభించిన వివరాల్లో ఎక్కువగా వ్యాపారులు, ఎన్నారైలు ఉన్నట్టు తెలుస్తోంది నల్లధనం వెలికితీతకు చర్యలు ఉంటాయన్న భయంతో పలువురు తమ ఖాతాలు మూసివేశారని, అలాంటి వారి వివరాలు ఎక్కువగా ఉన్నట్టుకూడా తెలుస్తోంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *