Breaking News
Home / World / ఢిల్లీ కంటే దారుణంగా మారిన సిడ్నీ

ఢిల్లీ కంటే దారుణంగా మారిన సిడ్నీ

సిడ్నీ: పొగ దుప్పట్లో చిక్కుకుపోయి ఊపిరాడక అవస్థ పడుతున్న ఢిల్లీ వాసుల కష్టాలు పగవాడికి కూడా రావద్దు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ), అదే.. వాయు కాలుష్యం గురించి తెలిపే సూచీ ఒకానొక సమయంలో ఢిల్లీలో 700కు చేరుకుంది. స్వఛ్చమైనా గాలి లేక ప్రజలు అల్లాడిపోయారు. ఇక చిన్నారులు, వృద్ధులూ, రోగుల పాట్లు అయితే వర్ణనాతీతం. మరి అదే ఎక్యూఐ 2500కు చేరుకుంటే..? అసలు ఇది సాధ్యమేనా అనే ప్రశ్న అస్సలు వేయద్దు. ఎందుకంటే సిడ్నీ ప్రజలు ప్రస్తుతం అటువంటి దురవస్థనే ఎదుర్కుంటున్నారు.

ఆ నగరమంతా దట్టమైన పొగ విస్తరించింది. పొగ నగరంలోనే తిష్ట వేయడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఓపక్కన కళ్లు మంటలు, మరో పక్క ఊపిరి కూడా తీసుకోలేని దురవస్థ. ఈ అవస్థల కారణంగా ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య 25 శాతం పెరిగిందని అక్కడి మీడియా చెబుతోంది. ఈ పోగ కారణంగా కొన్ని భవంతుల్లో ఫైర్ అలారమ్‌లు కూడా మోగడం ప్రారంభించాయంటే పొగ ఎంత దట్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సిడ్నీ చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో ఏక్యూఐ 2500 మార్కును కూడా దాటిపోయింది. ఒక్కముక్కలో చెప్పాలంటే..ప్రజాజీవనం స్తంభించిపోయింది.
సిడ్నీ నగరం పొరుగున్న ఉన్న అడువుల్లో మంటలు చెలరేగడంతో దట్టమైన పోగ ఆ నగరాన్ని కమ్మేసింది. స్థానికంగా వీటిని బుష్‌ఫైర్ అని పిలుస్తారు. ఈ బుష్‌ఫైర్లు ప్రతి ఏడూ సంభవించేవే అయినప్పటికీ.. పెరుగుతున్న భూతాపం కారణంగా వీటి తీవ్రత ప్రతి ఏడూ పెరిగిపోతోంది. దీంతో బొగ్గు ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించే అస్ట్రేలియా ప్రభుత్వంపై కూడా క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *