Breaking News
Home / Film News / ‘సైరా న‌ర‌సింహారెడ్డి’ రివ్యూ….

‘సైరా న‌ర‌సింహారెడ్డి’ రివ్యూ….

చిత్రం: సైరా న‌ర‌సింహారెడ్డి

నిర్మాణ సంస్థ: కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ

న‌టీన‌టులు: చిరంజీవి, అమితాబ్ బ‌చ్చ‌న్‌, విజ‌య్ సేతుప‌తి, కిచ్చా సుదీప్, జ‌గ‌ప‌తిబాబు, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, అనుష్క‌, ర‌వికిష‌న్‌, నిహారిక‌, బ్ర‌హ్మానందం, ర‌ఘుబాబు త‌దిత‌రులు.

ర‌చ‌న‌: ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌, సాయిమాధ‌వ్
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: రాజీవ‌న్‌
సంగీతం: అమిత్ త్రివేది
నేప‌థ్య సంగీతం: జూలియ‌స్ పేకియం
ఛాయాగ్ర‌హ‌ణం: ర‌త్న‌వేలు
కూర్పు: ఎ.శ్రీక‌ర్ ప్ర‌సాద్‌
నిర్మాత‌: రామ్‌చ‌ర‌ణ్‌
ద‌ర్శ‌క‌త్వం: సురేంద‌ర్ రెడ్డి

మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాలు చేసిన సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుడు. అయితే ఈయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ఓ హిస్టారికల్ మూవీ కూడా చేయ‌లేదు. ఎప్ప‌టి నుంచో భ‌గ‌త్ సింగ్ త‌ర‌హా స్వాతంత్రోద్యమ వీరుడి పాత్ర చేయాల‌నుకున్నాడు. చ‌రిత్ర‌లో క‌నుమ‌రుగైన తొలి స్వాతంత్య్ర వీరుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి చిత్రాన్ని చేయాల‌ని ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ అడిగినా.. బ‌డ్జెట్ ప‌రిమితులు లేక‌పోవ‌డం, తెలుగు సినిమా మార్కెట్ పరిమితంగా ఉండ‌టంతో ఈ సినిమాను చిరంజీవి చేయ‌లేక‌పోయారు.  ఈ నేప‌థ్యంలో సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ద‌గ్గ‌ర‌కు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి సినిమా చేయాల‌నే విష‌యం చేరింది. హిస్టారిక‌ల్ మూవీ కావ‌డంతో భారీ బడ్జెట్ అవ‌స‌రం. ఇలాంటి స‌మ‌యంలో తండ్రి రీ ఎంట్రీ చిత్రాన్ని నిర్మించిన రామ్‌చ‌రణే ఈ హిస్టారిక్ మూవీ చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు.  మ‌రో ప‌క్క ఉయ్యాల‌వాడ వంశీకుల నుండి చిన్న వివాదం కూడా నెల‌కొంది. ఆందోళ‌న‌లు, కోర్టులు, కేసులంటూ న‌డిచాయి. ఎట్ట‌కేల‌కు అన్నీ స‌మ‌స్య‌ల‌ను దాటి ముందుకు వ‌చ్చిన ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌గాథ `సైరా న‌రసింహారెడ్డి` ప్రేక్ష‌కుల‌ను ఏ మేర మెప్పించిందో తెలుసుకోవాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం..

క‌థ‌:
ప్ర‌థమ స్వాతంత్య్ర స‌మ‌ర స‌మయంలో పాల్గొన్న ఝాన్సీ ల‌క్ష్మీబాయ్(అనుష్క‌) త‌న సైనికుల్లో స్ఫూర్తి నింప‌డానికి రేనాడు వీరుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి క‌థ‌ను చెప్ప‌డంతో సినిమా ప్రారంభం అవుతుంది. ప్ర‌థ‌మ స్వాతంత్య్ర స‌మ‌రం కంటే ముందు.. అంటే 1847లో రాయ‌ల‌సీమలోని ఉయ్యాల‌వాడ ప్రాంతానికి చెందిన పాలెగాడు న‌ర‌సింహారెడ్డి (చిరంజీవి). బ్రిటీష్ వారు ప‌రిపాల‌న‌లో ఉన్న ఈ ప్రాంతంలో 61 మంది పాలెగాళ్లు ఉండేవారు..వారిలో న‌ర‌సింహారెడ్డి కూడా ఓ పాలెగాడు. తీవ్ర‌మైన క‌రువు వ‌చ్చిన‌ప్పుడు బ్రిటీష్‌వారు ఆ ప్రాంతంలోని రైతులు, వ్యాపారుల‌ను ప‌న్నులు క‌ట్ట‌మ‌ని వేధించ‌డం మొద‌లు పెడతారు. గురువు గోసాయి వెంక‌న్న(అమితాబ్ బ‌చ్చ‌న్‌) స్ఫూర్తితో బ్రిటీష్‌వారు చేసే ఆకృత్యాలు చూడ‌లేక న‌ర‌సింహారెడ్డి వారికి ఎదురుతిరుగుతాడు. ఈయ‌న‌కు రాజు(కిచ్చాసుదీప్‌), రాజా పాండి(విజ‌య్ సేతుప‌తి), వీరా రెడ్డి(జ‌గ‌ప‌తిబాబు) త‌దిత‌రులు అండ‌గా నిలుస్తారు. బ్రిటీష్‌వారికి ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి ఎలా ఎదిరించాడు. వారితో న‌ర‌సింహారెడ్డి ఎలాంటి పోరాటాలు చేశాడు. చివ‌ర‌కు ఆయ‌న్ని బ్రిటీష్‌వారు ఎలా బంధించి ఉరి తీశారనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

ప్ల‌స్ పాయింట్స్‌:
-మెగాస్టార్ చిరంజీవి
– ఇంటెన్స్ ఇంట‌ర్వెల్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌
– దేశ‌భ‌క్తి స‌న్నివేశాలు
– భారీ తారాగ‌ణం, వారి న‌ట‌న‌
– నిర్మాణ విలువ‌లు

మైన‌స్ పాయింట్స్‌:
– ఫ‌స్టాఫ్ స్లోగా ఉండ‌టం
– చిన్న పాలెగాడుని ఓ పెద్ద చ‌క్ర‌వ‌ర్తి అనే త‌ర‌హాలో సినిమా యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేశారు.

విశ్లేష‌ణ‌:
ఆరు ప‌దుల వ‌య‌సులో ఓ యాక్ష‌న్ పార్ట్ ఉన్న స్వాతంత్రోద్యమ నాయ‌కుడి సినిమాలో న‌టించ‌డం అంత సుల‌భం కాదు. కానీ మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి పాత్ర‌లో అద్భుతంగా న‌టించాడు. ఆయన లుక్ చ‌క్క‌గా స‌రిపోయింది. ఇక యాక్ష‌న్ పార్ట్‌లో చిరుచేసిన స్టంట్స్ చూసి ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఇక ఎమోష‌న‌ల్ సీన్స్‌లోనూ అద్భుతంగా న‌టించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో చిరు న‌ట‌న అభినంద‌నీయం. ఇక బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఉన్న కాసేపు కూడా త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. రాజు పాత్ర‌లో కిచ్చాసుదీప్, రాజా పాండి పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి, సిద్ధ‌మ్మ పాత్ర‌లో న‌య‌న‌తార‌, లక్ష్మీ పాత్ర‌లో త‌మ‌న్నా, వీరారెడ్డి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు ఇలా అంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు త‌మ న‌ట‌న‌తో ప్రాణం పోశారు. ఇక సాంకేతికంగా చూస్తే.. ఓ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడి సినిమాను అప్ప‌టి కాలానికి తగిన‌ట్లు తెర‌కెక్కించ‌డం అంటే అంత సులువైన విష‌యం కాదు. అది కూడా చ‌రిత్ర‌లో క‌నుమ‌రుగైన ఓ స‌మ‌ర‌యోధుడి క‌థ‌ను రూపొందిన ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి, నిర్మాత రామ్‌చ‌ర‌ణ్‌ల‌ను అభినందించాలి.

చివ‌ర‌గా.. సై సైరా న‌ర‌సింహారెడ్డి

రేటింగ్‌: 3.25/5

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *