Breaking News
Home / States / Telangana / 2019 ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన టీ కాంగ్రెస్

2019 ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన టీ కాంగ్రెస్

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. ముందస్తు ఎన్నికలకు టీఆర్‌ఎస్ సన్నద్ధమవుతుంటే.. కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసి ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను ప్రకటించింది. గాంధీభవన్‌ను ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి టీ కాంగ్రెస్ ఈ వివరాలను ప్రకటించారు. ఆరుఏడు నెలల నుంచి మేనిఫెస్టోకు కసరత్తు జరిగిందని ఆయన చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ప్రతిపాదనలలోని ప్రధానాంశాలు..

టీ కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రధానాంశాలు
ఇంటి స్థలం ఉన్న అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇల్లు
ఇళ్లు లేని కుటుంబాలకు రూ.5 లక్షలు
కల్యాణ లక్ష్మీ సహా బంగారు తల్లి పథకం పునరుద్ధరణ
ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్
అన్ని రకాల పెన్షన్లు రెట్టింపు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అదనంగా రూ.2 లక్షలు
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టుకుంటే రూ.5 లక్షలు
దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే రూ.2లక్షలు

ఇదిలా ఉంటే.. మేనిఫెస్టో ప్రకటించిన సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై ఉత్తమ్ విమర్శలు చేశారు. ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలను నిరూపించలేకపోయారని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం 4లక్షల ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు ఆపేసిందని ఆరోపించారు. అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Check Also

జయరాం హత్య కేసు: ప్రేమ దక్కలేదు.. ఆస్తి చిక్కలేదు!

Share this on WhatsAppఅడ్డు పడ్డాడన్న కసితోనే జయరాం హత్య పోలీసులకు వెల్లడించిన హంతకుడు రాకేశ్‌రెడ్డి లేడీ గొంతుతో ట్రాప్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *