Breaking News
Home / Tag Archives: 10 members injured

Tag Archives: 10 members injured

బాణసంచా పరిశ్రమలో పేలుడు….

తమిళనాడు: తమిళనాడులోని ఓ బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు అగ్నిమాపక యంత్రాల ద్వారా మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రత కారణంగానే పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.

Read More »

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం…

మేడికొండూరు: గుంటూరు జిల్లా మేడి కొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు, కంటైనర్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌ క్యాబిన్‌లోని సీట్లోనే ఇరుక్కుపోవడంతో స్టీరింగ్‌ తొలగించి బయటకు తీశారు. గుంటూరు నుంచి మాచర్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సు, సత్తెనపల్లి నుంచి గుంటూరు వెళ్తున్న కంటైనర్‌ పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

Read More »

శంషాబాద్ లో రోడ్డు ప్రమాదం…

శంషాబాద్: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. శబరిమలై నుంచి సంగారెడ్డికి అయ్యప్ప భక్తులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ శంషాబాద్ కోత్వాల్‌గుడా వద్దకు రాగానే డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది అయ్యప్ప భక్తులకు గాయాలు కాగా, డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. …

Read More »

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం..

ప్రకాశం: కొనకనమెట్ల మండలం, కొత్తపల్లి వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, తుఫాను వాహనం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు కర్ణాటకకు చెందిన ఉద్ధట్టి హంసమ్మ, చెట్లపల్లి సుగుణమ్మ, బళ్ళారి సునీత, సిద్దంపల్లి ఇమాంతరెడ్డిగా గుర్తించారు. శ్రీశైలం నుండి తిరుపతి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. లారీ …

Read More »

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కాఠ్‌మాండూ: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి బోల్తా కొట్టిన ఘటనలో 17 మంది దుర్మరణం పాలవ్వగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. నేపాల్ లోని అర్ఘకాచి జిల్లాలోని సింధికార్క నుంచి రూపందేహీ జిల్లా కేంద్రానికి బయలుదేరిన బస్సు మార్గమధ్యలో ప్రమాదానికి గురైంది. నిన్న సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలుఇవీ. …

Read More »

విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం….

విజయవాడ: విజయవాడలోని బీఆర్‌టీఎస్‌ రోడ్డు పడవల జంక్షన్‌ దగ్గర డివైడర్‌ను ఢీకొని ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడటంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన సమయంలో బస్సులో మొత్తం 49 మంది ప్రయాణికులున్నారు.

Read More »

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం..

నల్గొండ: నల్గొండ జిల్లాలోని నేరేడుగొమ్మ మండలం చిన్న మునిగల్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చందంపేట మండలం గువ్వలగుట్టకి చెందిన 45 మంది కూలీలు మినీ డీసీఎం వ్యానులో వెళుతుండగా అదుపు తప్పి బోల్తాపడింది. ప్రమాదంలో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించారు.

Read More »

గుంటూరులో పిడుగుపాటు.. 10మందికి గాయాలు..

వట్టిచెరుకూరు: పిడుగు పాటుకు పది మంది వ్యవసాయ కూలీలు గాయపడిన ఘటన గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నేపాడులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండగా.. మరో ఎనిమిది మంది స్వల్పంగా గాయపడ్డారు. పొలంలో కలుపు తీస్తుండగా పిడుగులు పడడంతో వ్యవసాయ కూలీలు చెట్టు కిందకు పరుగులు తీశారు. ఈ క్రమంలో పిడుగు పడటంతో పది మంది కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 …

Read More »