Breaking News
Home / Tag Archives: 144 section

Tag Archives: 144 section

విజయవాడలో ప్రారంభమైన నిషేధాజ్ఞలు

విజయవాడ: శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా శుక్రవారం నుంచి విజయవాడలో నిషేధాజ్ఞలు ప్రారంభమయ్యాయి. విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ , మోట్రోపాలిటన్‌ ప్రాంత అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ శ్రీనివాసులు తెలిపారు. ఆగస్టు 31వ తేదీ వరకు 46 రోజుల పాటు కమిషనరేట్‌ పరిధిలో 5గురు లేదా అంతకు మించి జనం ఒక దగ్గర ఉండరాదని పేర్కొన్నారు. రాళ్లు, కర్రలు, వంటివి …

Read More »

ముంబైలో కఠిన చర్యలు.

మహారాష్ట్రలో కరోనా రక్కసి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ముంబై మహా నగరం ఈ మహమ్మారి దెబ్బకు విలవిల్లాడుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దీని ప్రభావం తగ్గడం లేదు. కేసులు, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలో మే 17 వరకు సెక్షన్ 144 విధిస్తున్నట్టు ప్రకటించింది. వైద్యం కోసం తప్ప వేరే ఇతర …

Read More »

నేటి నుంచి మే 31 వరకు 144 సెక్షన్‌

విజయవాడ: నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో గురువారం నుంచి మే 31వ తేదీ వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని నగర పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌. ద్వారకా తిరుమలరావు తెలిపారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా 46 రోజుల పాటు 144 సెక్షన్‌ విధించినట్టు తెలిపారు. ఈ కాలంలో నలుగురు, అంతకంటే ఎక్కువమంది నిలబడి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read More »

నోయిడాలో 30 వరకూ 144 సెక్షన్‌…

న్యూఢిల్లీ : మహమ్మారి కరోనా వైరస్‌ కేసులు విస్తృతంగా వ్యాప్తి చెందడంతో నోయిడా ప్రాంతంలో ఏప్రిల్‌ 30 వరకూ 144 సెక్షన్‌ విధిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈనెల 14తో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ముగిసినా నోయిడాలో నిషేదాజ్ఞలు కొనసాగుతాయి. మరోవైపు దేశమంతటా లాక్‌డౌన్‌ అమలవుతున్నా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3000 దాటగా మృతుల సంఖ్య 75కు పెరిగింది. 212 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యేందుకు సిద్ధంగా ఉన్నా రోజురోజుకూ ఈ …

Read More »

రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు…

హైదరాబాద్: రాజేంద్రనగర్ జన్వాడ డ్రోన్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. చర్లపల్లి జైలు నుంచి రేవంత్‌రెడ్డి సాయంత్రం విడుదలకానున్నారు. కరోనా కారణంగా జైలు దగ్గర 144 సెక్షన్‌ విధించారు. 14 రోజులుగా చర్లపల్లి జైలులో ఉన్న ఆయనకు.. హైకోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. తొలుత కుకట్‌పల్లి కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చగా.. ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు …

Read More »

నాగ్‌పూర్‌లో 144 సెక్షన్‌…

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పలు రకాల చర్యలు తీసుకుంటున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కరోనా అనుమానిత కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక్క ముంబైలోనే 14 మందికి ఈ మహమ్మారి సోకగా, రాష్ట్రవ్యాప్తంగా 39 మంది ఈ వైరస్ బారినపడ్డారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన నాగపూర్ మరో అడుగు ముందుకు వేసింది. 144 సెక్షన్ విధించింది. పోలీస్ జాయింట్ …

Read More »

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య అత్యుత్సాహం…

జనగామ: స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే రాజయ్య అత్యుత్సాహం ప్రదర్శించారు. 144 సెక్షన్ అమలులో ఉన్న తన అనుచరులతో కలిసి పోలింగ్ బూత్‌‌లోకి వెళ్లి రాజయ్య హంగామా సృష్టించారు. రాజయ్యకు ఓటు హక్కు ఉన్న పోలింగ్ బూత్‌ ఏకగ్రీవం అయినా ఎమ్మెల్యే మాత్రం వార్డులో హల్‌చల్ చేశారు. దీంతో 12వ వార్డు కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థులకే ఎన్నికల అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారని కాంగ్రెస్ …

Read More »

రాజధాని గ్రామాల్లో పరిస్థితి ప్రశాంతం: ఎస్పీ

అమరావతి: రాజధాని గ్రామాల్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని ఎస్పీ విజయరావు తెలిపారు. రైతులు, మహిళలు శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తున్నారని, బయటి వ్యక్తులు వచ్చి హడావుడి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. 144, 30 సెక్షన్లను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని ఎస్పీ విజయరావు హెచ్చరించారు.

Read More »

అమరావతిలో అలజడికి కుట్రలు..

విజయవాడ: రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. అమరావతిలో అలజడి సృష్టించేందుకు అసాంఘిక శక్తులు కుట్రలకు పాల్పడుతున్నాయి. జేఏసీ ముసుగులో కుట్రలకు పన్నాగం చేస్తున్నారని ఇంటెలిజెన్స్‌ అధికారులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు కొన్ని పార్టీలు రాజధాని గ్రామాల్లోకి ఇతర ప్రాంతాలవారిని రప్పిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అల్లర్లకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చేటప్పుడు వారిపై దాడి చేసేందుకు …

Read More »

నేడు గవర్నర్‌తో అమరావతి జేఏసీ నేతల భేటీ

అమరావతి: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో అమరావతి జేఏసీ నేతలు ఈరోజు మధ్యాహ్నం సమావేశంకానున్నారు. ఇందులో భాగంగా మూడు రాజధానుల సమస్యను గవర్నర్‌కు జేఏసీ నేతలు వివరించనున్నారు. రాజధాని గ్రామాల్లో మహిళలపై పోలీసుల దాడులు, 144 సెక్షన్ అమలుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. అలాగే విజయవాడలో మహిళల ర్యాలీని అడ్డుకోవడం, పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించిన పరిణామాలను…రైతు ఆందోళనలు, రాజధాని మార్పు వల్ల కలిగే నష్టాన్ని గవర్నర్‌కు జేఏసీ నేతలు వివరించనున్నారు.

Read More »