Breaking News
Home / Tag Archives: Ajarudhin OYC

Tag Archives: Ajarudhin OYC

‘ఢిల్లీ అల్లర్లపై ప్రధాని నోరుమెదపాలి’

హైదరాబాద్‌: ఢిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్లను ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ మారణహోమంగా అభివర్ణించారు. ఢిల్లీ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని, బాధిత ప్రజలను పరామర్శించేందుకు ఆయా ప్రాంతాల్లో పర్యటించాలని కోరారు. దేశ రాజధానిని కదిపివేసిన అల్లర్లపై ఎన్డీయే నేతలు మౌనం దాల్చడాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన అధికార నివాసానికి సమీపంలో జరిగిన ఢిల్లీ హింసాకాండపై ఎందుకు నోరు మెదపడం లేదని తాను …

Read More »

సోనియా, రాహుల్‌లపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలు విద్వేషపూరిత ఉపన్యాసాలు చేశారని, వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో గురువారం పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఢిల్లీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, ముంబై మాజీ ఏఐఎంఐఎం ఎమ్మెల్యే వరీస్‌ పఠాన్‌లు విద్వేషపూరిత ఉపన్యాసాలు చేశారని, వారిపైనా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలంటూ ‘లాయర్స్‌ వాయిస్‌’ తరఫున గురువారం పిటిషన్లు దాఖలయ్యాయి. …

Read More »

ఢిల్లీ పూర్తిగా పోలీసుల కంట్రోల్ లోనే ఉంది

హైదరాబాద్‌: ఢిల్లీలో హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్న వారి వెనక ఎవరున్నా.. వారిపై చర్యలు తప్పవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ.. ఢిల్లీ ఘటన ఫెయిల్యూర్ కాదని.. ఢిల్లీ పూర్తిగా పోలీసుల కంట్రోల్ లోనే ఉందని తెలిపారు. కేసీఆర్ అండ చూసుకుని అసదుద్దీన్ రెచ్చిపోతున్నారని.. పులిమీద కేసీఆర్ స్వారీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. లక్ష మంది అసదుద్దీన్లు అడ్డుపడినప్పటికీ …

Read More »

అమూల్యకు నక్సల్స్‌తో లింక్

బెంగళూరు: బెంగళూరులో నిన్న సిఏఏకు వ్యతిరేకంగా అసదుద్దీన్ ఒవైసీ నిర్వహించిన సభలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ యువతి చేసిన స్లోగన్స్ వివాదానికి దారి తీస్తున్నాయి. స్లోగన్స్ చేసిన యువతిని అమూల్యగా గుర్తించిన పోలీసులు.. ఆమెను 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు. కాగా సదరు యువతికి నక్సల్స్‌తో లింక్స్ ఉన్నాయంటూ కర్ణాటక సీఎం యడ్యూరప్ప కామెంట్స్ చేశారు. ఇటు అమూల్య చేసింది తప్పేనని యువతి తండ్రి కూడా స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

Read More »

పథకం ప్రకారమే జామియా కాల్పులు: ఒవైసీ

న్యూఢిల్లీ: జామియానగర్, షహీన్‌ బాగ్ కాల్పుల ఘటనలు పథకం ప్రకారం జరిగినవేనని, ఇలాంటి వాటికి కేంద్ర మంత్రుల ప్రోత్సాహం అంతకంతకూ పెరుగుతున్నందున మునుముందు మరిన్ని ఘటనలు చేటుచేసుకునే అవకాశాలు లేకపోలేదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ‘నిశ్చయంగా ఈ ఘటనలు పథకం ప్రకారం జరిగినవే. ఒక కేంద్ర మంత్రి కాల్చిచంపండంటూ ప్రకటించారు. దాని ఫలితమే ఈ కాల్పులు. అరుదుగా మాత్రమే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. అయితే మంత్రుల …

Read More »

నన్ను చంపెయ్యండి: ఓవైసీ

దేశద్రోహులను కాల్చివేయాలంటూ(గోలీ మారో) నిన్న కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కౌంటరిచ్చారు. ‘అనురాగ్ ఠాకూర్.. నేను సవాల్ చేస్తున్నా. దేశంలో ఎక్కడికి రమ్మన్నా నేను వస్తా నన్ను చంపెయ్యండి. మీ మాటలకు నేను భయపడటం లేదు. ఎందుకంటే దేశాన్ని రక్షించడానికి భారీగా నా అక్కాచెళ్లెల్లు, తల్లులు రోడ్ల మీదకు వస్తున్నారు’ అని ఓవైసీ అన్నారు.

Read More »

CAAకు వ్యతిరేకంగా ఈ నెల 10న ర్యాలీ

CAAను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో ఈ నెల 10న ర్యాలీ నిర్వహించనున్నట్లు ఈ MIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ర్యాలీ తర్వాత హైదరాబాద్ శివారులోని శాస్త్రీపురంలో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. అటు భారతదేశాన్ని హిందూమత రాజ్యంగా మార్చాలని బీజేపీ కుట్రలు చేస్తోందని.. దీన్ని సాగనివ్వబోమని చెప్పారు. ఇక JNUలో విద్యార్థులపై దాడికి నైతిక బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలని అసద్ డిమాండ్ చేశారు.

Read More »