Breaking News
Home / Tag Archives: amaravathi

Tag Archives: amaravathi

రాజధానిలో మరో రైతు మృతి

అమరావతి: రాజధానిలో మరో రైతు గుండె ఆగింది. అమరావతి పరిధిలోని వెలగపూడికి చెందిన అబ్బూరి అప్పారావు(55) గుండెపోటుతో ఈరోజు ఉదయం మృతి చెందారు. రాజధాని నిర్మాణానికి 7 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన అప్పారావు అమరావతి తరలింపుపై గత కొన్నిరోజులుగా ఆందోళనతో ఉన్నారు. దీంతో పాటు రాజధాని ఉద్యమంలో పాల్గొన్న తన కుమారుడు, కోడలిపై పోలీసులు కేసులు పెట్టి వేధిస్తుండటంతో మనోవేదనతోనే అప్పారావు చనిపోయినట్లు బంధువులు ఆరోపించారు.

Read More »

రాజధాని కోసం ఆగిన మరో గుండె

అమరావతి: రాజధాని అమరావతి తరలిపోతుందనే మనస్థాపంతో మరో గుండె ఆగింది. తుళ్లూరుకు చెందిన మహిళా రైతు పువ్వాడ వెంకాయమ్మ(55) గుండెపోటుతో మృతి చెందింది. శనివారం సాయంత్రం వరకు దీక్షా శిబిరంలోనే వెంకాయమ్మ ఉన్నారు. జిల్లాలోని నేలపాడులో శుక్రవారం ఇందుర్తి సుబ్బమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. మూడు రాజధానుల నిర్ణయంతో తీవ్ర మనోవేదనకు గురైన సుబ్బమ్మ గుండెపోటుతో మృతి చెందింది. రాజధాని కోసం ఇప్పటి వరకు దాదాపు 11 మంది …

Read More »

సెల్ టవర్ ఎక్కిన నలుగురు యువకులు… అమరావతిలో ఉద్రిక్తత!!

ఏపీలో రాజధాని పోరాటం మరింత ఉధృతమవుతోంది. నెలరోజులుగా అలుపెరగకుండా పోరాటం చేస్తున్న అమరావతి ప్రాంత ప్రజలు.. రాజధానిని తరలించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని తేల్చి చెబుతున్నారు. వైసీపీ సర్కార్ రాజధాని మార్పు విషయంలో వేగంగా అడుగులు వేస్తుండటంతో.. ప్రజలు ఉద్యమాన్ని ఉదృతం చేశారు. దీక్షలు, ధర్నాలు, హోమాలు, గవర్నర్ కి ఫిర్యాదులు, ప్రధానికి లేఖలు ఇలా అన్ని రకాల శాయశక్తులా పోరాడుతున్నారు. అయితే తాజాగా నలుగురు యువకులు రాజధాని …

Read More »

‘మూడు రాజధానులు నాశనానికే’

విజయనగరం: తెలుగు భాష, సంస్కృతి ఉన్నంతవరకు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్‌, టీడీపీ నిలిచిపోతాయని టీడీపీ నేత అశోక్‌గజపతిరాజు అన్నారు. అమరావతి కోసం రైతులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, భూమిని త్యాగం చేసిన రైతులు ఈ దుస్థితిని ఎదుర్కోవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక రాష్ట్రానికి మూడు రాజధానులనడం అస్థిరత్వానికి దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు. భవిష్యత్‌ తరాలను నాశనం చేసేందుకే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారంటూ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. …

Read More »

అమరావతిలో నేటి కార్యక్రమాలు

ఆరాధనోత్సవాలు విషయం: త్యాగరాజ ఉత్సవాలు సమయం: ఉదయం 9 గంటలకు వేదిక: సంగీత కళాశాల ఆవిష్కరణ విషయం: రహదారి భద్రతా వారోత్సవాల పోస్టర్‌ ఆవిష్కరణ సమయం: ఉదయం 9 గంటలకు వేదిక: స్టెల్లా కళాశాల సమావేశం విషయం: వెనుకబడిన ప్రాంతాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం సమయం: ఉదయం 11 గంటలకు వేదిక: దాసరి భవన్‌ జయంతి విషయం:లూయీ బ్రెయిలీ జయంతి సమయం: ఉదయం 11 గంటలకు వేదిక: హనుమంతరాయ గ్రంథాలయం …

Read More »

నేడు పశ్చిమ గోదావరి జిల్లాకు రానున్న చంద్రబాబు

అమరావతి రాజధానికి మద్దతుగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నేడు జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో పర్యటిస్తారు. ఇప్పటికే ఆయన వివిధ జిల్లాల్లో పర్యటన పూర్తి చేసుకుని పశ్చిమలోను విస్తృ తంగా పర్యటించి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి, అమరావతికి పూర్తిస్థాయిలో ప్రజా మద్దతు కూడ గట్టడానికి ఉద్దేశించిన జేఏసీ పక్షాన చంద్రబాబు జిల్లా పర్యటన చేస్తారు. ఇంతకుముందే జిల్లావ్యాప్తంగా రాజధానికి మద్దతుగా ప్రజా ఆందోళనలు, నిరసనలు నిరవధికంగా కొన సాగుతూనే ఉన్నాయి. …

Read More »

రేపు ఏపీ కేబినెట్ భేటీ

ఏపీ కేబినెట్ భేటీ తేదీ మారింది. తొలుత ఈ సమావేశం ఈనెల 20న జరగాల్సి ఉండగా, రేపు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో హైపవర్ కమిటీ నివేదికపై ప్రధానంగా చర్చించనున్నారు. రాజధాని తరలింపుతో పాటు అమరావతి రైతుల విషయంలో ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. రాగా ఈనెల 20 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా, ఇందులో మూడు రాజధానుల బిల్లు …

Read More »

గవర్నర్‌ను కలిసిన అమరావతి జేఏసీ నేతలు

విజయవాడ: రాజధాని ప్రాంతంలో పరిస్థితులను వివరించడం కోసం అమరావతి జేఏసీ నేతలు ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. రాజధాని ప్రాంతంలో పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, రైతులపై దాడులకు తెగబడ్డారని వారు గవర్నర్‌కు తెలిపినట్లు సమాచారం. గవర్నర్‌ను కలిసి బయటకు వచ్చిన అమరావతి జేఏసీ నేతలు విలేకరులతో మాట్లాడారు. రాజధాని రైతుల, ప్రజల బాధలను గవర్నర్‌కు వివరించామని, పోలీసుల నిరంకుశ ప్రవర్తనను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. అమరావతిలోనే …

Read More »

రాజధాని కోసం ఆగిన మరో గుండె

గుంటూరు: రాజధాని అమరావతి తరలిపోతుందనే మనస్థాపంతో మరో గుండె ఆగింది. జిల్లాలోని నేలపాడులో ఇందుర్తి సుబ్బమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. మూడు రాజధానుల నిర్ణయంతో తీవ్ర మనోవేదనకు గురైన సుబ్బమ్మ శుక్రవారం గుండెపోటుతో మృతి చెందింది. రాజధాని కోసం ఇప్పటి వరకు దాదాపు 10 మంది రైతులు, రైతు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రాజధానిగా అమరావతినే కొనసాగాలంటూ రైతులు చేపట్టిన ఉద్యమం 31వ రోజుకు చేరింది. మూడు …

Read More »

నేడు గవర్నర్‌తో అమరావతి జేఏసీ నేతల భేటీ

అమరావతి: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో అమరావతి జేఏసీ నేతలు ఈరోజు మధ్యాహ్నం సమావేశంకానున్నారు. ఇందులో భాగంగా మూడు రాజధానుల సమస్యను గవర్నర్‌కు జేఏసీ నేతలు వివరించనున్నారు. రాజధాని గ్రామాల్లో మహిళలపై పోలీసుల దాడులు, 144 సెక్షన్ అమలుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. అలాగే విజయవాడలో మహిళల ర్యాలీని అడ్డుకోవడం, పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించిన పరిణామాలను…రైతు ఆందోళనలు, రాజధాని మార్పు వల్ల కలిగే నష్టాన్ని గవర్నర్‌కు జేఏసీ నేతలు వివరించనున్నారు.

Read More »