Breaking News
Home / Tag Archives: amaravati

Tag Archives: amaravati

వైసీపీ నేత ట్వీట్లపై స్పందించిన శ్రీ భరత్….

అమరావతి: నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ భరత్ కుటుంబం రూ.13 కోట్లు బకాయి పడ్డట్టు ఆంధ్రా బ్యాంక్, పేపర్లలో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చింది అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్లపై శ్రీ భరత్ స్పందించారు. “విజయసాయి రెడ్డి గారు…ఇప్పుడు మీరు ప్రభుత్వంలో బాధ్యత గల పదవిలో ఉన్నారు. మీరు అంతే బాధ్యతగా మాట్లాడాలని ఆశిస్తాము. కానీ అందుకు భిన్నంగా …

Read More »

టీడీపీతో ఎప్పటికీ పొత్తు పెట్టుకోదు…

అమరావతి: రాజకీయ విలువలు లేని టీడీపీతో బీజేపీ ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని ఎపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అవినీతే అజెండాగా అవకాశవాద రాజకీయాలతో యూటర్న్ లు తీసుకుంటూ దేశ రాజకీయాల్లో విలువలను దిగజార్చిన పార్టీగా టీడీపీని అభివర్ణించారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పొత్తుకోసం వెంపర్లాడుతున్నారో చెప్పాలని కన్నా నిలదీశారు.

Read More »

అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో కీలక నిర్ణయం….

అమరావతి : ఎపీ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ.264,99,00,983 విడుదల చేసింది. ఈ మొత్తాన్ని మొదట రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రూ.10 వేల లోపు డిపాజిట్లు కలిగిన 3,69,655 మందికి పంపిణీ చేయనున్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్‌ఎం కిషోర్‌ కుమార్‌ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు.

Read More »

టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు….

అమరావతి : ఏపీలో మరో టీడీపీ ఎమ్మెల్యేపై పోలీస్ కేసు నమోదైంది. ఎన్నికల సమయంలో ఓటర్లకు దొంగపట్టాలు పంపిణీ చేశారన్న ఆరోపణలపై కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు చేశారు. మొన్నటి ఎన్నికల సమయంలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారని బాపులపాడు తహశీల్దార్ నరసింహారావు ఆరోపించారు. ఈ మేరకు హనుమాన్ జంక్షన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. …

Read More »

విజయసాయిపై బుద్దా వెంకన్న వ్యాఖ్యలు

అమరావతి: తాను బెస్ట్ సీఎం అవుతాడు అనుకున్న వాడు కాస్తా తుగ్లక్ ముఖ్యమంత్రిగా మిగిలిపోయే సరికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మైండ్ పోయిందని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. తుగ్లక్ నిర్ణయాలతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని గమనించి రాష్ట్రం వదిలి ఢిల్లీకి పారిపోయాడని బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.

Read More »

ఆయనకు దేవాలయాలంటే విలువ లేదు…

అమరావతి: టీడీపీ హయాంలో దేవాదాయ భూములు అన్యాక్రాంతమయ్యాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. సూరాయపాలెంలో 10 ఎకరాలను బినామీలకు కట్టబెట్టారన్నారు. జీవోలను రద్దు చేసి భూములు స్వాధీనం చేసుకుంటామన్నారు. ఆలయాల భూముల పరిరక్షణకు ఐపీఎస్‌ అధికారితో కమిటీ వేస్తామన్నారు. భూముల వివరాలను రిజిస్ట్రేషన్ శాఖకు పంపుతామని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు దేవాలయాలంటే విలువ లేదని… విజయవాడలో అనేక ఆలయాలను కూల్చేశారని ఆరోపించారు. అర్చకులకు ఇళ్ల …

Read More »

వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి…

అమరావతి : ప్రకాశం బ్యారేజీ దిగువన వరద ప్రవాహంలో ఓ వ్యక్తి కొట్టుకుపోతూ కన్పించాడు. ఆ వ్యక్తి ఆర్తనాదాలు బ్యారేజీపై వెళ్తున్నవారికి వినిపించాయి. వారు అందించిన సమాచారంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. బాధితుడు క్షేమ సమాచారం తెలియాల్సి ఉంది.

Read More »

మొట్టికాయలు వేస్తున్నా వైసీపీలో మార్పు రాదా?…

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలు గత కొన్నిరోజులుగా నిలిచిపోయిన విషయం విదితమే. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటికే పలుమార్లు డీటీశాట్ స్పందిస్తూ ఏబీఎన్‌ ఛానెల్‌ను పునరుద్దరించాలంటూ తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంపై తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. మొట్టికాయలు వేస్తున్నా మార్పు రాదా!? ‘ఏపీలో ఏబీఎన్‌ ప్రసారాల నిలుపుదలపై టీడీశాట్‌ విచారణలో సాంకేతిక కారణాలంటూ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది?. కోర్టుల ముందు ఒక తీరుగా.. …

Read More »

ప్రజారోగ్యంపై సీఎం జగన్ సమీక్ష…

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజారోగ్యంపై సమీక్ష నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం సచివాలయంలో జగన్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. ఈ సమీక్షలో ఆరోగ్య శ్రీ, 1000 రూపాయలు దాటితే ఉచితవైద్యం, తదితర అంశాలపై నిశితంగా చర్చిస్తున్నారు. మరీ ముఖ్యంగా పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల ఆధునికీకరణ, సౌకర్యాల మెరుగుపై చర్చ జరుగుతోంది.

Read More »

ఆదాయం లేదు… సంపద సృష్టిపై ఆలోచన లేదు…

అమరావతి: రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున లూటీ చేస్తూ.. ప్రతిపక్ష నేతలను ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పెడుతున్నారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తామేం చేసినా రాయటానికి వీల్లేదన్నట్లు మీడియాని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు లేకపోయినా ప్రజలను మోసం చేసేందుకు ఆచరణ సాధ్యం కాని ప్రకటనలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాల్లో లబ్దిదారుల సంఖ్య గణనీయంగా తగ్గించేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. అర్హులకు ప్రయోజనం దక్కకుండా చేస్తున్నారన్నారు. …

Read More »